బక్షీ నిఫార్సులతో ఛిద్రమైన సహకార స్వప్నం సాకారమయ్యేనా?


వ్యవసాయరంగపు పెట్టుబడి అవసరాలను తీర్చడానికి సహకార పరపతి సంఘాలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులతో కూడిన మూడంచెల వ్యవస్థ ఉత్తమమైనదని మన ప్రభుత్వాలు భావించాయి. పంటరుణాలతోబాటు పెట్టుబడి గుణాలను కూడా ఇదే వ్యవస్థ ద్వారా అందించాలని మన రాష్ట్రంలో ‘ఏకగవాక్ష విధానాన్ని’ ప్రవేశపెట్టారు. 66 సంవత్సరాలుగా సహకార వ్యవస్థను మెరుగుపరచడానికి ఎన్నో కమిటీలు వేశారు. ‘సహకారం విఫలమైంది, కాని దానిని ఎలాగైనా విజయవంతం చేయాలి’ అంటూ నివేదికలు సూచనలిస్తూ వచ్చాయి. తాజాగా నాబార్డు చైర్మన్ ప్రకాష్‌బక్షీ నేతృత్వంలోని కమిటీ 2013 జనవరిలో భారత రిజర్వ్ బ్యాంకుకి తమ నివేదికను సమర్పించింది.

సహకార రంగంపై ఆశలు : స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ద్వారా సోషలిస్టు తరహా సమాజాన్ని నిర్మిస్తామని చెప్పింది. గ్రామీణ ప్రాంతాల్లో సహకార రంగానికి ప్రాముఖ్యత ఇవ్వాలని భావించింది. సహకార పరపతి సంఘాలు, సహకార మార్కెటింగ్, సహకార చక్కెర ఫ్యాక్టరీలు, సహకార పాడి పరిశ్రమ సమాఖ్య, సహకార వినిమయ సంఘాలు వంటి అనేక సంస్థల ఏర్పాటుకి ప్రోత్సాహాన్నిచ్చింది. కేంద్రంలో, రాష్ట్రంలో సహకార మంత్రిత్వశాఖల్ని ఏర్పరిచింది. ఒక దశలో సహకార వ్యవసాయ క్షేత్రాలనేర్పాటు చేయాలని సంకల్పించి, ఆ తర్వాత సాధ్యాసాధ్యాల మీమాంసతో వెనక్కు తగ్గింది. ముఖ్యంగా రైతులకు పంటరుణాలనివ్వటానికి ప్రాథమిక సహకార పరపతి సంఘాలు నెలకొల్పింది. దేశంలో ఐదు లక్షల గ్రామాలుంటే రెండులక్షలకుపైగా ఇలాంటి ప్రాథమిక సహకార పరపతి సంఘాలు ఏర్పరిచి, వాటి ద్వారా పరపతి సౌకర్యంతోపాటు, నిత్యావసర వస్తువుల సరఫరా, ఎరువుల పంపిణీ వంటి బహుళార్థ సాధక కార్యక్రమాలు చేపట్టాలని భావించింది. అలాగే పెట్టుబడి రుణాలనం దించటానికి సహకార భూఅభివృద్ధి బ్యాంకులు స్థాపించింది. పంట రుణాలకు మూడంచెల వ్యవస్థ, పెట్టుబడి రుణాలకు రెండంచెల వ్యవస్థ దాదాపు దేశమంతటా ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ రెండింటినీ ఏకీకృతం చేని, ఏకగవాక్ష విధానానికి మారాము గాని ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఈ రెండు వ్యవస్థలూ సమాంతరంగా పనిచేస్తున్నాయి.
రైతుల భాగస్వామ్యం : ప్రాధమిక  సహకార పరపతి సంఘంలో రైతులు సభ్యత్వం తీసుకొని, రుసుము చెల్లిస్తారు. ఆ తర్వాత వాళ్ళు తీసుకునే పంట రుణాల్లో పదిశాతాన్ని మూలధనవాటాగా మినహాయించి, ఆ మొత్తాలను ప్రాధమిక  సహకార పరపతి సంఘం జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో జమ చేస్తాయి. అలాగే జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు తాము రాష్ట్ర సహకార బ్యాంకు నుండి పొందే మొత్తంలో కొంతభాగాన్ని మూలధన వాటాగా రాష్ట్ర సహకార బ్యాంకులో దాచుకుంటాయి. రాష్ట్ర సహకార బ్యాంకులు ఒకప్పుడు రిజర్వ్ బ్యాంకు నుండి, ప్రస్తుతం నాబార్డు నుండి రుణాలు పొందుతున్నాయి. ప్రతి స్థాయిలోనూ సహకార వ్యవస్థ కూడగట్టుకునే మూలధనానికి కొన్ని రెట్ల మొత్తాన్ని పై స్థాయి బ్యాంకు నుండి పొందుతాయి. నాబార్డు నుండి ఆరుశాతం వడ్డీపై రాష్ట్ర సహకార బ్యాంకు రుణం పొందితే, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకి అది ఏడున్నరశాతం వడ్డీతో రుణాలందిస్తుంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ప్రాధమిక  సహకార పరపతి సంఘాలకు తొమ్మిది శాతం వడ్డీకి రుణాలందిస్తాయి. ప్రాధమిక  సహకా పరపతి సంఘాలు తమ సభ్యులకు పదకొండు శాతం వడ్డీ రేటుతో రుణాలనిస్తాయి. ఇలా పంటరుణాల కవసరమైన సొమ్ముని కొంత మూలధనం ద్వారా, దానికెన్నో రెట్లు నాబార్డు నుండి రుణాల ద్వారా సమకూర్చుకుంటాయి. రైతులు సకాలంలో రుణాలను చెలిే్లన్త ఈ సహకార రుణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. మూల ధన వాటా పెరిగే కొద్దీ లభించే పంట రుణాల మొత్తాలు పెరుగుతాయి.
ఆర్థిక స్వావలంబన : సహకార వ్యవస్థ ప్రారంభమయ్యేటప్పటికి వడ్డీ వ్యాపారులు వారిచ్చే రుణాలపై 24 శాతం నుండి 36 శాతం వరకు వడ్డీని తీసుకునే వాళ్ళు. వాటితో పోలిేన్త సహకార వ్యవస్థలో 12 శాతంలోపే వడ్డీ రేటుకి పంట రుణాలు లభిస్తాయి కాబట్టి రైతులు వాటిని ఆదరిస్తారని ప్రభుత్వాలు భావించాయి. కాని రైతులకు పంట దెబ్బతిన్నప్పుడు, ధరలు పడిపోయినప్పుడు రుణాల్ని తిరిగి చెల్లించక బకాయిలు పేరుకున్నాయి. పరపతి సంఘాలు బకాయిలు చెల్లించకపోతే కేంద్ర సహకార బ్యాంకులు కొత్తరుణాలనివ్వవు. ప్రతి స్థాయిలోనూ గడువు ముగినిన తర్వాత రుణాల్ని తిరిగిచెలిే్లన్త అపరాధరుసుం వేస్తారు. అసలు, వడ్డీ, అపరాధపు వడ్డీ పేరుకుపోతే పరపతి సంఘాలు రైతు పంటలను జప్తు చేయాలి. అవసరమైతే పొలాన్ని వేలం వేని, బాకీ వసూలు చేసుకోవాలి. కాని రాజకీయాలు కలగలవటం వల్ల పరపరతి సంఘాలు అంత కఠినంగా వ్యవహరించలేవు. రాజకీయ ఒత్తిడి వల్ల పంట రుణాలను ‘రీ షెడ్యూల్’ చేయటం జరుగుతుంది. ఫలితంగా టర్నోవర్ తగ్గి, ప్రాధమిక  సహకార పరపతి సంఘాలు తమ ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించలేని పరిన్థితి ఏర్పడి, మూతబడేవి. కొన్నాళ్ళకు అలాంటి పరపతి సంఘాలను పక్క వాటితో కలిపేయటం జరిగింది. రెండు లక్షలకు పైగా ఏర్పడ్డ సహకార పరపతి సంఘాలు ఇప్పుడు తొంభైవేల కన్నా తక్కువయ్యాయి. రెండుమూడు సహకార పరపతి సంఘాలను కలిపినా అవి ఆర్థికంగా నిలదొక్కుకోలేక పోయాయి.
ప్రధాన సమస్యలు : రైతులు తాము తీసుకునే పంట రుణాల్లో పది శాతాన్ని మూలధనానికి జమకట్టుకోవడాన్ని నిరనిస్తున్నారు. గ్రామీణ బ్యాంకుల నుండి గానీ, జాతీయ బ్యాంకుల నుండి గానీ రుణాలు తీసుకుంటే ఇలాంటి కోతలుండవు. కాని మూలధనం సమకూరకపోతే రుణాలు పొందటానికి అర్హత పెరగదు. వడ్డీ రేటు నాబార్డు స్థాయిలో ఐదారు శాతం ఉంటే రైతు స్థాయికి వచ్చేటప్పటికి పదకొండు, పన్నెండు శాతాలకు పెరుగుతుంది. సహకార వ్యవస్థలో ‘బ్యూరోక్రనీ’ని పోషించటానికి సగం వడ్డీ పోతున్నది. రాజకీయాలు సహకార వ్యవస్థతో మిళితమవటం వల్ల రుణాల్ని తిరిగి చెల్లించటంలో అలసత్వం ఏర్పడుతుంది. అపరాధపు వడ్డీల భారాన్ని భరించడమూ కష్టమవుతున్నది. ఎలాగోలా సహకార వ్యవస్థను నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీ రాయితీలను కల్పించటం మొదలుపెట్టాయి. 1990లో ఒకసారి, 2008లో మరోసారి రుణమాఫీలను కేంద్ర ప్రభుత్వాలు చేపట్టాయి. దానితో మరోమారు రుణమాఫీ వస్తుందనే ఆశతో చాలామంది రైతులు రుణాల్ని తిరిగి చెల్లించటం లేదు. ఎన్ని వడ్డీ రాయితీలనిచ్చినా, ఎన్నిసార్లు రుణాల్ని ‘రీషెడ్యూల్’ చేనినా సహకార వ్యవస్థకు ఊపిరినందించలేకపోయారు.
డీలాపడ్డ సహకార వ్యవస్థ : మూలధన వాటాలు పెరిగి, వ్యాపారం వర్థిల్లితే సహకార వ్యవస్థ ఆర్థికంగా జవసత్వాలను కలిగి ఉంటుంది. బకాయిలు పెరిగి, మూలధనం సమకూరకపోతే పరపతి సంఘాలు ‘డీలా’ పడిపోతాయి. ప్రాధమిక పరపతి సంఘాలు ఆర్థికంగా బలహీనమైతే జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు వ్యాపారాన్ని నిర్వహించలేవు. అవి రాష్ట్ర సహకార బ్యాంకుకి బకాయిలు పడతాయి. రాష్ట్ర సహకార బ్యాంకులకు నాబార్డు నుండి పరపతి సదుపాయాలు తగ్గుతాయి. మొత్తం సహకార రుణ వ్యవస్థ ఆర్థికంగా కుదేలవుతుంది.
ప్రభుత్వాలు రుణాల రీషెడ్యూలు, వడ్డీరాయితీలు, రుణమాఫీలు ఇచ్చినకొద్దీ ఈ వ్యవస్థ న్థితి మరింత దిగజారుతున్నది కాని పుంజుకోవటం లేదు. ఎప్పటికప్పుడు ఎలాగైనా సహకార ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. కాని నానాటికీ కునారిల్లుతున్నది. ప్రాధమిక సహకార పరపతి సంఘాలకు డిపాజిట్లు తీసుకునే వీలులేదు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు ఆ వాలున్నా చెప్పుకోదగ్గ స్థాయిలో అవి డిపాజిట్లను ఆకర్షించలేకపోతున్నాయి. వ్యవసాయానికిచ్చే సంస్థాగత రుణాల్లో సహకార బ్యాంకుల వాటా తగ్గిపోతుంది. పెట్టుబడి రుణాల కల్పన బాగా మందగించింది. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం అవసరమైన మూలధనశాతాన్ని చాలా బ్యాంకులు చేరలేక పోతున్నాయి.
వైద్యనాథన్ కమిటీ : సుమారు పదేళ్ళ క్రితం వైద్యనాధన్ కమిటీ సహకార వ్యవస్థలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టాలని సూచించింది. ఈ వ్యవస్థకు మూలధనాన్ని సమకూర్చాలని కేంద్రప్రభుత్వానికి సూచించింది. నాబార్డుని సహకార సంఘాల ఆడిట్ చేయించమని కోరింది. 2004 జూన్ 30 నాటికి 50 శాతం రుణాలనన్నా వసూలు చేని కేంద్ర సహకార బ్యాంకులకు జమకట్టిన సహకార పరపతి సంఘాలన్నీ మూలధన సాయాన్ని పొందటానికి అర్హమైనవి. కనీసం 30 శాతం రుణాలనన్నా వసూలు చేయని పరపతి సంఘాలకు మూలధన సహాయం పొందే వీలులేదు. 30 నుండి 50 శాతం రుణాల్ని వసూలు చేనిన సహకార పరపతి సంఘాలు తమ పని తీరుని మెరుగుపరచుకొని 2006 మార్చి నాటికి 50 శాతం రికవరీ స్థాయిని దాటితే అవి కూడా నాబార్డు ద్వారా మూలధన సాయం పొందే అవకాశముంది. 30 శాతం కన్నా తక్కువ రికవరీ కలిగిన పరపతి సంఘాల్ని బాగా పనిచేస్తున్న ఇతర సహకార సంఘాలతో కలపమని సూచించింది. సహకార వ్యవస్థకు మూలధనాన్ని అందించటానికి కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుండి, ఆనియా అభివృద్ధి బ్యాంకు నుండి దాదాపు పదివేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుంది. సహకార బ్యాంకులను రాజకీయ జోక్యం నుండి తప్పించాలనీ, ప్రతి ఐదేళ్ళకూ ఎన్నికలు నిర్వహించాలనీ, ప్రతి పరపతి సంఘం ‘బిజినెన్ డెవలప్‌మెంట్ ప్లాను’ని తయారు చేని నాబార్డు అనుమతి పొందాలనీ సూచనలు చేశారు. ఈ సంస్కరణలను అమలు జరగక ముందే 2008లో రుణమాఫీ అమలు చేశారు. ఎన్నికల్లో లాభం కోసం సహకార రంగంలోని సంస్కరణలకు తిలోదకాలిచ్చి అధికార పార్టీ ప్రజారంజక చర్యకు దిగింది. బకాయిలు వసూలు చేనిన సంఘాల కన్నా ఎక్కువగా రుణ బకాయిలు పేరుకు పోయిన సంఘాలు మరింత లాభాన్ని పొందాయి. దానితో జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ‘బ్యాలెన్స్‌షీట్లు’ ఒకటి రెండు సంవత్సరాల పాటు కళకళలాడాయి.
ప్రకాష్‌బక్షీ కమిటీ : రుణా మాఫీ జరిగిన రెండు మూడేళ్ళకు మళ్ళీ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు మూలధన కొరతను ఎదుర్కొన్నాయి. దేశంలోని 370 జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో 161 మాత్రమే రిజర్వు బ్యాంకు నిర్దేశించిన స్థాయిలో మూలధనాన్ని కలిగి ఉన్నాయి. అవి 2014-15 నాటికి 7 శాతం మూలధనాన్ని, 2016-17 నాటికి 9 శాతం మూలధనాన్ని సమకూర్చుకోగలుగుతాయి. మిగిలిన 209 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు 2014-15 నాటికి రూ. 4024 కోట్లు, 2016-17 నాటికి 6498 కోట్లు మూలధనాన్ని సమకూర్చుకోవటం ద్వారా రిజర్వ్ బ్యాంకు నిబంధనలను చేరుకోగలుగుతాయి. బక్షీ కమిటీ అంచనాల ప్రకారం 151 కేంద్ర సహకార బ్యాంకులు మాత్రమే మూలధన లక్ష్యాలను చేరగలుగుతాయి. అందుకు తమ సభ్యులందరి నుండీ నాలుగేళ్ళలో 2000 నుండి 4000 రూపాయల్ని వసూలు చేయాల్సి ఉంటుంది. మిగిలిన 58 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఆ లక్ష్యాలను చేరుకోవటంపై ఈ కమిటీ అనుమానాలను వ్యక్తం చేనింది.
రాష్ట్ర సహకార బ్యాంకులు మొత్తం వ్యవసాయరుణాల్లో 17 శాతం మాత్రమే ఇవ్వగలుగుతున్నాయని బక్షీ కమిటీ తేల్చింది. వ్యవసాయ పరపతి సంఘాలిచ్చే రుణాల్లో 40 శాతం, కేంద్ర సహకార బ్యాంకులిచ్చే రుణాల్లో 50 శాతం వ్యవసాయేతర కార్యక్రమాలకు లభిస్తున్నాయని గుర్తించింది. రాష్ట్ర సహకార బ్యాంకులు తమ పరిధిలోఇచ్చే మొత్తం వ్యవసాయ రుణాల్లో 15 శాతం వాటా అయినా కలిగి ఉండాలనీ, క్రమేపీ ఆ వాటాను 30 శాతానికి పెంచాలనీ సూచించింది. ప్రతి కేంద్ర సహకార బ్యాంకు తామిచ్చే రుణాల్లో 70 శాతమన్నా వ్యవసాయానికివ్వాలని నిఫార్సు చేనింది. కేంద్ర సహకార బ్యాంకు గానీ, రాష్ట్ర సహకార బ్యాంకుగానీ ఒక ప్రాంతంలో ఇచ్చే వ్యవసాయ రుణాల్లో కనీసం 15 శాతమన్నా తాము సమకూర్చకపోతే వాటిని పట్టణ సహకార బ్యాంకులుగా ప్రకటించాలని సూచించింది. కేంద్ర సహకార బ్యాంకులు ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలను తమ అనుబంధ వ్యాపార శాఖలుగా మార్చి, వాటి ద్వారా డిపాజిట్లను ేనకరించాలని నిఫార్సు చేనింది. స్వతంత్ర సహకార ఎలక్షన్ అథారిటీని ఏర్పరిచి, దాని ద్వారా సకాలంలో ఎన్నికలను జరిపించటం ద్వారా పాలక వర్గాల నెన్నుకోవాలని చెప్పింది. ఇందుకు రాష్ట్ర సహకార సంఘాల చట్టాన్ని ప్రతి రాష్ట్రం మార్చాలని కోరింది. సహకార వ్యవస్థను బలపరచటానికి ప్రకాష్ బక్షీ కమిటీ చేనిన నిఫార్సును కేంద్రం అమలు జరిపి, సహకార వ్యవస్థను బలపరుస్తుందని ఆశిద్దాం. ఎందుకంటే సహకార రంగం పూర్తిగా విఫలమైతే ప్రత్యామ్నాయాలను వెదకటం మరింత కష్టం గదా!
 - డా. కిలారు పూర్ణచంద్రరావు
ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త,
(రిటైర్డ్ అండ్ కన్సల్టెంట్ ఇక్రిసాట్)

Rythunestham

Editor :Venkateswara Rao
Ritunestham - Agricultural Monthly Magazine

No comments:

Post a Comment