అభివృద్ధికి పెనుసవాల్‌గా మారిన వాతావరణ మార్పులు

వరుణదేవుడికి ప్టరాని కోపం కల్గినా, సంతోషం వచ్చినా రైతన్నకు కష్టాలు, కన్నీళ్ళే మిగుల్తాయి. వరుణుడి ఆజ్ఞానుసారం మేఘాలు వర్షించినా, వర్షించకపోయినా వ్యవసాయం కుదేలవుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కునారిల్లుతుంది. ఏది జరిగినా రైతు చేనది ఒక్కటే. చేతులెత్తి ఆకాశానికి వినమ్రతతో జోడించటం. మనస్సునిండా కన్నీళ్ళు దిగమింగుకుని, బరువైన గుండెను భారంగా మోస్తూ, కష్టాల కడలి ఈదుతూ భవిష్యత్తు వైపు గుండెదిటవు చేసుకుని అడుగు లేయటం మాత్రమే రైతులకు తెలుసు. అదే రివాజుగా మారింది.
గత కొద్ది కాలంగా వాతావరణంలో వస్తున్న మార్పులు భవిష్యత్తు గురించి భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. వ్యవసాయరంగం మనుగడను శానిస్తున్నాయి. అభివృద్ధికి సవాల్ విసురుతున్నాయి. శాజ్ఞుల మేథస్సుకు పదనుపెడ్తున్నాయి. విధాన నిర్ణేతలకు పనిపెడ్తున్నాయి. వెరని మొత్తంగా మనిషి మనుగడను, వ్యవసాయ రంగ భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆధునిక శా విజ్ఞానానికి పజిల్‌గా మారి పరిష్కారం దొరకని చిక్కుముడులవుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతానికి సమిధలవుతున్నది మాత్రం రైతాంగ వ్యవేన్థ.
కరవు వచ్చినా, కాటకం ఎదురైనా, వరదొచ్చినా, ఉప్పెన ఎగినిపడ్డా రైతుజీవితం కకావికలం. వ్యవసాయ రంగం కోలుకోలేని కుదుపుకు లోనవుతుంది. వ్యవసాయంపట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. వ్యవసాయానికి, రైతాంగానికి భరోసా ఇచ్చే విధానాలు కరువయ్యాయి. పట్టించుకునే నాథుడు లేడు. ఏవో తాత్కాలిక ఉపశమనాలు తప్ప, శాశ్వత పరిష్కారాలు కానరావు. ఆ దిశగా ఆలోచనలు లేవు. తరతరాలుగా ఇదే పరిన్థితి.
భవిష్యత్తు మరింత భయంకరంగా ఉంటుందని అందరూ హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులు వ్యవసాయ శావేత్తలను కలవరపెడ్తున్నాయి. ఆర్థికవిధానాల రూపకర్తలకు చెమటలు పట్టిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రత పెరుగుతున్న కరవులు, ఎక్కువ కాలం కన్పిస్తున్న పొడివాతావరణం, అకాల వర్షాలు, వరదలు, రుతుపవనాలు మధ్యలోనే ఆగిపోవటం, తరచుగా తీవ్రంగా వస్తున్న తుఫానులు, సముద్రమట్టాలు పెరగటం, కోస్తా ప్రాంతాలు ముంపుకు గురవడం, మంచుకొండలు కరగటం లాంటి ఎన్నో ప్రతికూలతలు వాతావరణంలో సంభవించటం సర్వసాధారణమవుతున్నాయి. వీటన్నింటితో భావితరాల భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుంది.
ఈ విధంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల ప్రభావం భారతదేశంపై అత్యధికంగా ఉంటుందని నిపుణులు విశ్లేషించారు. 2020 కల్లా 1970 సంవత్సరంతో పోలిేన్త భారత దేశంలో ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల ెనల్సియన్ పెరిగే వీలుంది. అదేవిధంగా చలి తీవ్రత కూడా 0.7 నుండి 3 శాతం పెరుగుతుందని అంచనా. 2030 కల్లా దేశంలో వర్షాలు కురిేన రోజులు, తుఫానులు తగ్గుతాయని అయితే అప్పుడప్పుడు వచ్చే తుఫాను, వర్షాల తీవ్రత పెరుగుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. దేశంలోని తూర్పుకోస్తా ప్రాంతం తీవ్ర ప్రభావానికి గురయ్యే అవకాశముందంటున్నారు.
ఈ వాతావరణ మార్పులవల్ల తప్పనిసరిగా వ్యవసాయంలో దిగుబడులు బాగా క్షీణించటం, పర్యవసానంగా వ్యవసాయోత్పత్తుల ధరలు ఆకాశానికి చేరగలవని ఊహిస్తున్నారు. అంతేకాదు పంటలకు కావల్సిన నీరు, విత్తనాలు, రసాయనాలకు అంచనాలకు మించి వెచ్చించాల్సి వస్తుందంటున్నారు. మొత్తంగా ఆహార, ఇంధన భద్రతలకు విఘాతం కల్గుతుంది. నీటికొరత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యుద్ధాలే రావచ్చనే అభిప్రాయం సర్వత్రా విన్పిస్తుంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు తాత్కాలికచర్యలుగా సరైన బీమా, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు పండించే పంట ఆధారంగా నష్టపరిహారం చెల్లింపు, తిరిగి పంట వేేనందుకు వీలుగా రుణాల రీషెడ్యూల్ జరగాలి. రైతుకు కావల్సిన ఉత్పాదకాలను సకాలంలో సత్వరంగా నాణ్యంగా సరఫరా చేేనందుకు ముందస్తు ప్రణాళిక నిద్ధం చేసుకోవాలి. ఇవి కొంత ఆదరవు కల్గించవచ్చు.
అయితే శాశ్వత నివారణ మార్గాల గురించి అన్వేషించాలి. కరవు, ముంపులను తట్టుకోగల్గిన వంగడాల అభివృద్ధి పరిశోధనల ఎజెండా కావాలి. వాతావరణ మార్పుల అధ్యయనంపై దృష్టి కేంద్రీకరించాలి. ఇప్పటినుంచే వాతావారణ మార్పులు విసురుతున్న సవాళ్ళను గుర్తించి వీటి ప్రభావం అతి తక్కువగా ఉండేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుని యుద్ధప్రాతిపదికమీద అమలు చేయాలి. ఉద్యమస్ఫూర్తితో అవి జరగాలి. ఆలస్యమయ్యే కొద్దీ, అలసత్వం వహించే కొద్ది భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. ‘‘వ్యవసాయం’’ మరిచిపోవల్సి వస్తుందేమోనన్న భయం ఏర్పడుతుంది. మొత్తంగా ‘‘అభివృద్ధి’’కి వాతావరణ మార్పులు పెనుసవాల్‌గా మార్తాయి. ఈ సవాల్‌ను న్వీకరించి ముందుకుసాగి వాటిని అధిగమిేన్తనే మనకు భవిష్యత్తు. లేదంటే ... మరుభూమే మిగుల్తుంది సుమా!
            - సంపాదకులు

Rythunestham

Editor :Venkateswara Rao
Ritunestham - Agricultural Monthly Magazine

No comments:

Post a Comment