ప్రపంచ వ్యవసాయ సదస్సు : ఎవరి కోసం?


హైదరాబాద్ వేదికగా నవంబర్ 4 నుండి 7 వరకు ప్రపంచ వ్యవసాయ సదస్సు జరుగనుంది. ఇది ౭వ సదస్సు. ఈ సదస్సు గురించి విభిన్న అభిప్రాయాలున్నాయి.  ప్రధానంగా ఈ సదస్సుల లక్ష్యం ప్రైవేటీకరణ, కార్పోరేట్ వ్యవసాయం ప్రోత్సహించటమేనన్న విమర్శ ఉంది. 
హైదరాబాద్‌లో నవంబరులో ప్రపంచ వ్యవసాయ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంది. ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న సదస్సు ఎవరికి కోసం అనే ప్రశ్న మన ముందుంది. దీని మీద ప్రజా ధనం ఖర్చు కాబోతున్నది. ఇది సాధారణంగా, మన రైతులకు ఉపయోగపడితే అందరికీ ఆమోదయోగ్యమే. ఈ సదస్సు ప్రపంచ వ్యవసాయ వేదిక  ఆధ్వర్యంలో ప్రతి రెండు సంవత్సరాలకొకసారి గత పది ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఐదు సదస్సులు అమెరికాలోని ఒకే నగరంలో జరుగగా, గత సదస్సు బెల్జియం దేశంలో జరిగింది. ఈ వేదిక ఉద్దేశ్యం కేవలం సదస్సులు జరిపి తద్వారా ప్రపంచ వ్యవసాయ అభివృద్ధి నిర్దేశన చేయడం. పెరుగుతున్న ప్రపంచ జనాభాకు తగు రీతిగా ఆహారాన్ని అందించాలంటే, అధిక ఉత్పత్తి ద్వారా సాధ్యం అనే నిద్ధాంతం వేదిక స్పష్టం చేస్తుంది. హరిత విప్లవాన్ని కొనసాగిస్తూ, వ్యవసాయాన్ని ఆధునికం చేయాలని ఆశించే ప్రపంచ సంస్థలలో ఇది ఒకటి. ఇదే సూత్రాన్ని పాటించమని ప్రైవేటు కంపెనీలు కూడా మన ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నాయి. ఈ దిశగా కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శరద్ పవార్ కూడా ఆలోచిస్తున్నారు. ఇటువంటి ఆలోచనలు చేేన వ్యక్తులు, సంస్థల కలయికే ఈ ప్రపంచ సదస్సు.
పేరుకు మాత్రం చిన్న రైతులు, మహిళా రైతుల ప్రయోజనాల కొరకు అని పత్రాలలో రాసుకున్నా, ఆచరణలో, చర్చల ప్రక్రియ రూపకల్పనలో ఈ విషయాల పట్ల ప్రాధాన్యత మనకు కనపడదు. ఈ సదస్సు నిర్వాహక కమిటీలో ఒక్క మహిళ లేకపోవటం, చిన్న రైతులు లేదా వారి ప్రతినిధులు లేకపోవటంతోనే సదస్సు కార్యక్రమానికి ప్రకటించిన ఉద్దేశ్యం మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనబడుతుంది. డొల్లతనం ఇక్కడే బయలు పడుతున్నది.
నాణ్యమైన విత్తనాలు దొరకక, నానా అవస్థలు రైతులు పడుతుంటే, వేనిన విత్తనాలు మొలకెత్తక, మొలక వచ్చిన మొక్కకు కాయ రాక, వచ్చిన కాయకు సరి అయిన మార్కెట్ ధర అందక రైతు ఇబ్బంది పడుతుంటే, అధిక ఉత్పత్తే మా లక్ష్యం అనే నినాదంతో ఏర్పాటవుతున్న ఈ సదస్సు రైతుల సమస్యలు ప్రస్తావించకుండా, సాధించేది ఏమిటి?
గత ౫ సంవత్సరాల బిటిప్రత్తి అనుభవంలో, రైతుకు జన్యు మార్పిడి విత్తనాల వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదని తేలింది. విత్తన కంపెనీలు మాత్రం రైతుల నుంచి అధికంగా లాభాలు గడించిన సందర్భంలో, జన్యుమార్పిడి విత్తనాలను నెత్తికెత్తుకున్న డా. కెన్నెత్ బేకర్ (ఛైర్మన్, ప్రపంచ వ్యవసాయ వేదిక) సదస్సును హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడంలో పెద్ద వ్యూహమే కనపడుతుంది. డా. కెన్నెత్ బేకర్ గతంలో మోన్‌శాంటో కంపెనీలో పని చేనిన వ్యక్తి. ఈయన యూరోప్, ఆఫ్రికా ఖండాలలో మోన్‌శాంటో కంపెనీ ప్రతినిధిగా ప్రభుత్వ వ్యవహారాలు చూనిన వ్యక్తి. వీరు జన్యు మార్పిడి సోయా విత్తనాలకు ఐరోపా సమాజంలో అనుమతులు సాధించడం ద్వారా జన్యు మార్పిడి సోయా ఉత్పత్తుల ప్రపంచ వాణిజ్యానికి తెర లేపిన సమర్ధుడు. భారత దేశంలో, పార్లమెంటులో, అటు సుప్రీం కోర్టులో కూడా జన్యు మార్పిడి విత్తనాలకు అనుమతుల గురించి తీవ్ర చర్చలు జరుగుతున్న సమయంలో సదస్సు ఏర్పాటు చేనిన విషయం మనం గమనించాలి.
దేశంలో విత్తనాల ఉత్పత్తి దాదాపు ౯౦ శాతం మనరాష్ట్రంలోనే జరుగుతుంది. విత్తన కంపెనీలు, వారికి వత్తాసు పలికే రాజకీయ నాయకులు, అధికారులు కలుసుకుని, జన్యుమార్పిడి విత్తనాల అనుమతులకు మార్గం సుగమం చేయడానికే ఈ సదస్సు నిర్వహణ. ఈ సదస్సుకు పెట్టుబడి పెట్టే వారిలో, మోన్‌శాంటో, బేయర్ లాంటి పెద్ద కంపెనీలు ఉండడం గమనార్హం.
ఇది వరకు జరిగిన సదస్సుల వివరాలు
1. 20-22 మే, 2001 వ్యవసాయంలో ఒక కొత్త శకం :  ప్రపంచానికి ఆహారం, ెనయింట్ లూయిన్,  మిస్సోరి
2. 18-20 మే, 2003 వ్యవసాయంలో ఒక కొత్త శకం : కలిని భవిష్యత్తు నిర్మాణం, అడ్డంకుల తొలగింపు, ెనయింట్ లూయిన్,  మిస్సోరి
3. 16-18 మే, 2005 శాంతి, రక్షణ మరియు వృద్ధికి మార్గం : స్థానిక, ప్రాంతీయ మరియు ప్రపంచ వ్యవసాయం - ఆహార వ్యవస్థలు, ెనయింట్ లూయిన్,  మిస్సోరి
4. 8-10 మే, 2007 వ్యవసాయంలో పెట్టుడుల ద్వారా సంపద సృష్టి, ెనయింట్ లూయిన్,  మిస్సోరి
5. 18-20 మే, 2009 వ్యవసాయ సవాలు, ెనయింట్ లూయిన్, మిస్సోరి
6. 28 నవంబర్ - 1 డిెనంబర్, 2011 వ్యవసాయంపైన పునరాలోచన, పెరుగుతున్న ప్రపంచ జనాభా పోషించటానికి, బ్రెనల్స్, బెల్జియం
౭. 4-7 నవంబర్, 2013 సున్థిర భవిష్యత్తుకు వ్యవసాయ స్వరూపాన్ని మార్చడం : చిన్న రైతుల మీద దృష్టి, ప్రస్తుతం హైదరాబాద్. 1997లో ప్రారంభించిన ప్రపంచ వ్యవసాయ వేదిక తమది వ్యవసాయ విధానాల మీద చర్చలను నిర్వహించే తటస్థ సంస్థ అని చెప్పుకుంటున్నారు. వ్యాపారులు మాత్రమే తమ వ్యాపారం కొనసాగించటానికి తటస్థంగా ఉంటారు. పైకి తటస్థం అని చెబుతున్నా, వారి వ్యవహారం, తీరు ఎక్కడా తటస్థంగా ఉన్నట్టు కనపడదు. రైతుల కొరకు ఏర్పాటు చేనిన సంస్థ కాదు. చిన్న రైతుల కొరకు ఏర్పాటు చేనిన సంస్థ అంత కన్నా కాదు. లక్షల కోట్ల వ్యాపారం జరుపుతూ, ఆయా పెట్టుబడులు ద్వారా ఏటా తమ మార్కెట్ వాటా పెంచుకుంటూ వస్తున్నా బహుళ జాతి కంపెనీల ెుుక్క వ్యాపారం వేదికగా ఈ సంస్థ కనపడుతున్నది. వీరు నిర్వహించే సదస్సుల ప్రధాన శీర్షికను బట్టి చూేన్త, ప్రపంచ వ్యవసాయాన్ని వ్యాపారాలకు అనుగుణంగా మార్చడం తమ ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్న వైనం కనపడుతుంది. ఆయా సదస్సులలో పాల్గొంటున్న ప్రతినిధులు, వారి ెుుక్క ఉపన్యాస శీర్షికల బట్టి కూడా. పెద్ద కమతాలలో ఆధునిక, వనరులను తీవ్ర స్థాయిలో ఉపయోగించే వ్యవసాయం గురించి ఆలోచిస్తున్నట్టు కనపడుతుంది.
వీరు నిర్వహిస్తున్న ప్రపంచ సదస్సులలో కేవలం వ్యవసాయాన్ని ఒక వ్యాపారంగా పరిగణించే దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, ప్రయివేట్ కంపెనీల భాగస్వామ్యంతో, వారికి అనుకూలమైన అంశాల మీదనే చర్చలు చేయడం జరుగుతున్నది. ఆయా సదస్సులకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలు భారీ స్థాయిలోనే చేపట్టారు. ప్రపంచ ఆర్థిక సదస్సు మాదిరిగా ఇది కూడా ప్రైవేటు / ప్రభుత్వ భాగస్వామ్యంతో నెేన్ల, కార్గిల్, మోన్‌శాంటో, బేయర్, నింజెంటా లాంటి కంపెనీలు వ్యవసాయం, విత్తన రంగాల మార్కెట్లో తమ గుత్తాధిపత్యాన్ని పెంచుకోవటానికి అవసరమైన విధానాల మీద కసరత్తు చేయటానికే ఈ సదస్సులు. ఈ వేదికకు అనేక సంవత్సరాలుగా, నిధులు సమకూర్చిన స్వచ్ఛంద సంస్థ కెలాగ్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ స్థాపించిన వ్యక్తి తన బహుళ జాతి కంపెని ద్వారా చేేన వ్యాపారం కేల్లోగ్గ్ చిప్స్ మరియు ఇతర ఉత్పత్తులు మనకు తెలినినవే.
వీరు ఇప్పటి వరకు ఆరు సదస్సులు నిర్వహించినా, అమెరికా ప్రభుత్వానికి వారు సమర్పించిన వార్షిక ఆర్థిక నివేదికలో ఆయా సదస్సుల జమా ఖర్చులు లేవు 2008-10 సంవత్సరాలకు సంబంధించి. కేవలం, జీత భత్యాలు, ఆఫీన్ ఖర్చులు మాత్రమే కనపడతాయి. మరి సదస్సు ఖర్చుల నిమిత్తం వచ్చే నిధులు ఎక్కడ నుంచి వచ్చాయి. ఎవరు ఖర్చు పెడతారు అనేది వీరి జమలో లేనందున మనకు సమాచారం లేదు. దీనిని బట్టి, సదస్సు ఖర్చులు నేరుగా ఆయా సంస్థలే భరిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఈ పాటి సంస్థకు, నిధులు ఖర్చు పెట్టి ఫలితాలు సాధిస్తున్న వ్యక్తులు, సంస్థలు ఎవరయి ఉంటారు?
ప్రపంచ వ్యవసాయ వేదిక ఒక స్వచ్చంద సంస్థ. నిండా 16 ఏళ్లు లేవు. కాని వీరు నిర్వహించే సదస్సులకు బహుళ జాతి కంపెనీల అధిపతులు, వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేని తమ ఆర్థిక పరిన్థితి మెరుగు పరుచుకునే దేశాల అధిపతులు పాల్గొనడం ఆశ్చర్యం కలిగించక మానదు. ప్రపంచ బ్యాంకు లాంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా ప్రతిసారి వీరి సదస్సులలో పాల్గొనడం, ఈ సంస్థ ెుుక్క ప్రాధాన్యతను, వారు చేేన చర్చలు ఎవరికి ఉపయోగపడతాయో సూచిస్తున్నది. ఇది ఒక అసాధారణ స్వచ్ఛంద సంస్థ. వీరి చర్చలు, పద్ధతులు బహుళ జాతుల ప్రయోజనాల కొరకు కాకుండా, బహుళ జాతి (లేదా, నానా దేశాల) కంపెనీల వ్యాపార ప్రయోజనాల కొరకే అని అర్థమవుతుంది. అటువంటి సదస్సుకు, వారి కార్యకలాపాలకు, మన దేశం అందునా మన రాష్ట్రాన్ని వేదికగా ఎందుకు ఎంచుకున్నట్టు?
జన్యు మార్పిడి పంటల పరిశోధన, ఉత్పత్తి అనుమతులకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో ఉన్న వ్యాజ్యం ఒక కీలక దశకు చేరుకుంది. కోర్టు నియమించిన టెక్నికల్ కమిటి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక జీవ రక్షణ మరియు భద్రత చర్యలు లేకుండా, జన్యు మార్పిడి విత్తనాల క్షేత్ర పరీక్షలు నిర్వహించరాదని చెబుతుంది. ఈ నివేదిక ఆధారంగా కోర్టు తీర్పు ఇంకా రావాల్సి ఉంది. అటు పార్లమెంటులో, బ్రాయ్ (ఔష్ట్రజు) బిల్లు ప్రవేశ పెట్టటం జరిగింది. దీనికి వ్యతిరేకంగా, పార్టీలకు అతీతంగా అనేక మంది సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పటం జరిగింది. ప్రస్తుతం, ఇది పార్లమెంటరీ స్థాయి సంఘం ముందుంది. కాగా, వ్యవసాయం పైన నియమించిన పార్లమెంటరీ స్థాయి సంఘం ఇప్పటికే జన్యు మార్పిడి పంటల అవసరం మన దేశ వ్యవసాయానికి అవసరం లేదు అని నివేదిక ఇవ్వటం జరిగింది. కేంద్ర వ్యవసాయ, పర్యావరణ మంత్రిత్వ శాఖల మధ్య జన్యు మార్పిడి పంటలకు అనుమతుల పైన ఏకాభిప్రాయం లేదు. ఈ తరుణంలో, మన వ్యవసాయ విధానాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నమే ఈ సదస్సు.
హైదరాబాద్‌లో జరిగే సదస్సులో ప్రధాన ఉపన్యాసం బేయర్ కంపెనీ ప్రతినిధి ఇవ్వబోతున్నాడు. మన రాష్ట్రంలో ఈ కంపెనీ వల్ల అనేక మంది రైతులు నష్టపోయారు. వారికి ఇప్పటికీ పరిహారం రాలేదు. ఈ కంపెనీ ప్రభుత్వ అధికారాన్నే ప్రశ్నిస్తూ, కోర్టులో వ్యాజ్యం నడిపిస్తూ, చిన్న రైతుల బాగు గురించిన సదస్సులో ప్రధాన ప్రసంగం చేయటం హాస్యాస్పదమే. నానిరకం విత్తనాల వల్ల నష్టపోయిన చిన్న, సన్నకారు రైతుల గురించి పట్టించుకోని భారత వ్యవసాయ మంత్రి శ్రీ శరద్ పవార్, ఆయా కంపెనీల మీద ధరల ఆంక్షలు పెట్టొద్దు అనీ రాష్ట్ర ప్రభుత్వానికి రాయడం, తుఫానుల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని చూడడానికి కూడా రాని ఆయన, చిన్న రైతుల పేరు మీద జరిగే సదస్సుకు రావటం శోచనీయం. మన రాష్ట్రంలో నానిరకం విత్తనాల వల్ల, అనేక సంవత్సరాలుగా చిన్న సన్నకారు రైతులు నష్టపోతున్నా, విత్తన కంపెనీలు బాధ్యత తీసుకోకపోగా, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి విత్తన ధరలు పెంచుకుని, తమ లాభాలను పెంచుకుంటున్నారు. విత్తన ఉత్పత్తిలో అగ్రగామి అయిన మన రాష్ట్రంలో ఈ సదస్సు పెట్టం గురించి ఆలోచించాలి. ఈ ప్రపంచ వ్యవసాయ వేదికకు, మన రాష్ట్ర ప్రజల నిధులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు?
2011 సమావేశంలో మాట్లాడుతూ జేమ్స్ బోల్గేర్, చైర్మన్, అంతర్జాతీయ సలహా సంఘం, ప్రపంచ వ్యవసాయ వేదిక, జన్యు మార్పిడి పంటల ఆవశ్యకత గుర్తు చేశారు. డబ్ల్యుఏఎఫ్ వెబ్‌ెనైట్ ప్రకారం వారి సహకారం అందించే సంస్థలలో ప్రపంచ బ్యాంకు, డబ్లు.కే. కెల్లోగ్గ్ ఫౌండేషన్, మోన్‌శాంటో, టూసన్, డిఐ ఆయిల్స్, నెెన్టల్, కార్పోరేట్ కౌన్సిల్ ఆఫ్ ఆఫ్రికా, ఇంటర్నేషల్ ఫుడ్ అండ్ పాలనీ రీసర్చ్ ఇన్‌న్టిట్యూట్, ద వరల్డ్ ఫుడ్ ఫ్రైజ్, పార్టనర్‌షిప్ టు ఎండ్ హంగర్ ఇన్ ఆఫ్రికా. ఇవన్ని కూడా మోన్‌శాంటో కంపెనీకి అనుగుణంగా పని చేస్తున్నవే.
డబ్ల్యు.ఏ.ఎఫ్ మరియు మోన్‌శాంటో కంపెని ెుుక్క ప్రధాన హెడ్ క్వార్టర్స్ ెనయింట్ లూయిన్ పట్టణం, మిస్సోరి రాష్ట్రంలో ఉండడం గమనార్హం. దీనిని బట్టి డబ్ల్యు.ఏ.ఎఫ్‌ను పెంచి పోషిస్తున్నది మోన్‌శాంటో కంపెనీ అనేది స్పష్టం. డబ్ల్యు.ఏ.ఎఫ్. వార్షిక ఆదాయం రు. 3.25 కోట్లు మాత్రమే. ఒకప్పుడు 2007లో, డబ్ల్యు.ఏ.ఎఫ్‌కు వచ్చిన మొట్ట మొదటి నిధులు రు. 12.5 లక్షలు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి వచ్చినవే. బిల్ గేట్స్ మోన్‌శాంటో కంపెనీలో ప్రధాన వాటాదారు. ఆ తరువాత. డబ్ల్యు.కె. కెల్లాంగ్ ఫౌడేషన్ నుంచి మరో రు. 6.5 లక్షల నిధులు వచ్చాయి. 2011లో వీరు నిర్వహించిన సమావేశాలకు ప్రపంచ వ్యాప్తంగా 350 ప్రతినిధులు వచ్చినట్లు అంచనా. డబ్ల్యు.ఏ.ఎఫ్ సొంత నిధులు ఈ స్థాయి సమావేశ ఖర్చులకు సరిపోవు. డబ్ల్యు.ఏ.ఎఫ్ చైర్మన్ ప్రకారం సమావేశ ప్రవేశ రుసుము ద్వారా తమకు నిధులు వస్తాయని చెప్పారు. 2011 సమావేశానికి ప్రవేశ రుసుము  euro 1000 పైనే ( దాదాపు లక్ష రూపాయలు). ఇవే గాక స్పాన్సర్ల ద్వారా నిధులు తీసుకుంటారు. ఈ స్పాన్సర్లు ఇదివరకు, ఇప్పుడు కూడా పెద్ద బహుళ జాతి కంపెనీలే.
ఈ తరహా నిధుల సమీకరణ వల్ల, సామాన్య ప్రజలు, రైతులను ఈ సమావేశాలకు దూరంగా ఉంచడం ఒక ఎత్తు అయితే, ఆయా కంపెనీలు ఈ వేదికను ఉపయోగించుకుని తమ లాబీయింగ్ చేసుకునే అవకాశం వేదిక కల్పిస్తుంది. డబ్ల్యు.ఏ.ఎఫ్ కేవలం రెండు ఏళ్ళకు నిర్వహించే కాంగ్రెన్ సమావేశాలే కాక అనేక దేశాలలో ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా సమావేశాల ఖర్చులు అన్ని కూడా స్పాన్సర్ల ద్వారా తీసుకోవడంతో ఎక్కడా లెక్కలు లేవు. దీనిని బట్టి, డబ్ల్యు.ఏ.ఎఫ్. పెద్ద, బడా బహుళ జాతి కంపెనీలకు లాబీయింగ్ వేదికగా ఉపయోగపడుతుంది.
గడచిన అనేక సమావేశాలలో, సామాన్య రైతులు పాల్గొన్న దృష్టాంతం లేదు. మేము తటస్థం అని చెబుతున్న డబ్ల్యు.ఏ.ఎఫ్. సంస్థ వారి ఏ ఒక్క సమావేశంలో కూడా, జన్యు మార్పిడి పంటల అభివృద్ధితో సంబంధం లేని, లేదా మోన్‌శాంటో కంపెనీ అనుబంధంగా కాని, ేనంద్రియ వ్యవసాయం లేదా ఇతర వ్యవసాయ పద్ధతులతో సంబంధం వ్యక్తులు లేదా సంస్థలను ఆహ్వానించిన సందర్భాలు లేవు. వారు పాల్గొన్న రుజువులు లేవు. పేరుకు ఆహార ఉత్పత్తి మీద దృష్టి అని చెబుతున్నా వ్యాపార అభివృద్ధి, తమ ఉత్పత్తులను ఎలా అమ్ముకోవాలి వంటి విషయాల మీదనే ప్రధాన దృష్టి.
ఉదాహరణకు, 2011 బ్రెన్సల్స్‌లో జరిపిన కాంగ్రెన్‌లో 4 రోజుల సమావేశంలో, మొదటి రోజు సగం ప్రారంభ సమావేశం ఉండింది. దీనిలో ప్రత్యేక, విశిష్ట అతిథుల సందేశాలతో ముగినింది. తరువాత, రెండవ రోజు 18 మంది, మూడవ రోజు 24 మంది, చివరి రోజు 8 మంది వక్తలు ఉపన్యాసాలు ఇేన్త, అందులో ఎవరు కూడా రైతులు కాదు. ఒకరిద్దరు తపిే్పన్త,అందరు కూడా ఏదో కంపెనీ లేదా వారికి సంబంధించిన అసోనియేషన్‌లో సభ్యులు. సమావేశాల తీరు కూడా, భాష కూడా అంతర్జాతీయమే. ఎక్కువగా రౌండ్ టేబుల్ సమావేశాలే. వారి సమావేశ శీర్షికలు పరిశీలిేన్త :
౧. వ్యవసాయంపైన పునరాలోచన : సమస్యలు
బీ వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కడ నుంచి వస్తుంది? ఇది నూతన ప్రపంచ ఒరవడికి దారి తీస్తుందా?
బీ రైతుల నుంచి సమాజం ఏమి ఆశిస్తుంది?
బీ వ్యవసాయానికి ఆధునిక టెక్నాలజీ : సవాళ్లు
బీ ప్రపంచ వాణిజ్య ఏర్పాటు ద్వారా ఆహార భద్రత
బీ వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా ఛైన్ నుంచి ఉపయోగాలు ఎలా రాబట్టాలి?
౨. వ్యవసాయంపైన పునరాలోచన : సాధ్యమయ్యే పరిష్కారాలు
బీ వ్యవసాయానికి ఒక నూతన దృష్టి : మార్కెట్ ఆధార పరిష్కారాలు
బీ తక్కువ నుంచి ఎక్కువ : సహజ వనరుల సున్థిర ఉపయోగంలో మార్పులు
బీ వ్యవసాయంలో పెట్టుబడులకి సూత్రాలు
బీ వ్యవసాయంలో భవిష్యత్తు పెట్టుబడులకు ప్రోత్సాహం
౩. ప్రపంచ వ్యవసాయంపైన పునరాలోచన: భవిష్యత్తుకు అవసరమైన నిధులు మరియు యజమాన్యం
బీ వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ : నియంత్రణ అవసరమా?
బీ వాణిజ్యం మరియు ఆర్థిక అంశాలు
ఈ శీర్షికలు అన్ని కూడా వ్యవసాయం మీద వ్యాపారం చేస్తున్న కంపెనీలకు ఉపయోగపడేవే కాని, సామాన్య రైతులకు కావు. ఒక విలేకరి, ఈ కాంగ్రెన్ తరువాత ఏమవుతుంది అని ప్రశిే్నన్త, ఒక ప్రతినిధి సమాధానం, పాల్గొన్న వారి మీద ఉంటుంది అన్నారు. ‘పాల్గొన్న వారి మీద బాధ్యత ఉన్నప్పుడు’, రైతులను కేవలం ఉత్సవ విగ్రహ పాత్రలోనే మిగిలిేన్త, 2013 డబ్ల్యు.ఏ.ఎఫ్. కాంగ్రెన్ నుంచి మనం ఏమి ఆశించగలం? ఏమి ఆశించలేనప్పుడు, ఇంత పెట్టుబడి అవసరమా? ఎవరు దీని వలన లబ్ది పొందుతారు? ఎవరు నష్టపోతారు? మన వ్యవసాయ పరిన్థితుల మీద మాట్లాడే సత్తా, ఆలోచన, చిత్తశుద్ధి మోన్‌శాంటో, బేయర్, నింజెంటా లాంటి కంపెనీ ప్రతినిధులకు ఉందా?
2009లో కూడా దాదాపు నిధులు, ఆర్థిక వనరులు, టెక్నాలజీ, వ్యాపారం, వాణిజ్యం తదితర ఆలోచనల చుట్టూ ఉన్న అంశాలే. ప్రధానంగా, ప్రభుత్వ విధానాలు, చట్టాలు ఏ విధంగా వారికి ఉపయోగపడుతాయి అనేది ఈ సమావేశంలో కనబడుతుంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగబోయే కాంగ్రెన్‌లో కూడా తరహా శీర్ష్టిలు ఉన్నాయి. రాష్ట్రంలో పురుగు మందులు లేకుండా లక్షల ఎకరాలలో రైతులు చేస్తున్న వ్యవసాయం గురించి ప్రస్తావన లేదు. చిన్న, సన్నకారు రైతులకు అవసరమైన పెట్టుబడుల గురించి చర్చ లేదు. వారు చేస్తున్న వ్యవసాయం ద్వారా ఆహార భద్రత ఎలా సాధించవచ్చు అనే శీర్షిక లేదు. ేన్వచ్ఛ వ్యవసాయ వాణిజ్యంతో రైతులు ఎలా నష్టపోతున్నారు అని ఎవరు ఉపన్యాసం ఇవ్వటం లేదు. రైతులు ఇందులో పాల్గొనే అవకాశాలు తక్కువ. ప్రవేశ రుసుము రాష్ట్ర ప్రభుత్వం భరించినా, భాష రాక, అనువాదకులు ఉన్నా, సంబంధం లేని విషయాలు అర్థం చేసుకునే అవకాశం రైతులకు లేదు, ఉండదు. మరి రైతులను ఎందుకు తీసుకు వస్తున్నట్టు? హాజరు కొరకు. రైతుల పేరు మీద నిధుల సహాయం. డబ్ల్యు.ఏ.ఎఫ్. చేస్తున్న కార్యకలాపాలకు దన్ను కొరకు మాత్రమే. బహుశ ఈ కాంగ్రెన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి జన్యుమార్పిడి పంటలకు అనుకూలంగా ఉపన్యాసం ఇచ్చినా ఆశ్చర్యపోవలనిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు, ఇదివరకు మంత్రివర్గంతో గాని, శాసనసభతో గాని సంప్రదించకుండా, విధాన ప్రకటన చేనిన సందర్భాలు ఉన్నాయి. ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది అంటూ కేంద్రానికి రానిన లేఖ ఒక ఉదాహరణ.
మొత్తంగా, ప్రపంచ వ్యవసాయ సదస్సు హైదరాబాద్‌లో నిర్వహించడం వలన మనకు నష్టమే తప్ప లాభం లేదు. చిన్న సన్నకారు రైతులు అనేక మంది ఉన్న మన దేశంలో, మన వ్యవసాయ సమస్యల మీద మనమే చర్చించుకుని పరిష్కరించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. బహుళ జాతి కంపెనీలు తమ అభిజాత్యాన్ని, ధిక్కార ధోరణినిని విడనాడే పరిన్థితిని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కల్పించాలి. రైతుల స్వాతంత్య్రాన్ని హరించే చర్చలు, సదస్సులకు ప్రభుత్వ నిధులు వినియోగించకూడదు. మన సమస్యల పరిష్కారానికి మన శావేత్తలు, అధికారులు, రైతుల మధ్య చర్చలు జరగాలి. 
- డాక్టర్ డి. నరనింహారెడ్డి
వ్యవసాయ విశ్లేషకులు, 201, ఆర్తీ రెనిడెన్సీ, లక్ష్మీనారాయణ కాలనీ, ెనైదాబాద్, హైదరాబాద్ - ౫౯, ఫోన్ : 0091-40-24077804 
Email:nreddy.donti@gmail.com

Rythunestham

Editor :Venkateswara Rao
Ritunestham - Agricultural Monthly Magazine

No comments:

Post a Comment