రాష్ట్రాభివృద్ధికి కీలకం కానున్న ఫుడ్ ప్రాెననింగ్

వ్యవసాయరంగ అభివృద్ధిలో ఫుడ్ప్రాెననింగ్ రంగం కీలకంగా మారుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగపు పెట్టుబడులను విపరీతంగా ఆకర్షిస్తోంది. దేశ, రాష్ట్రస్థాయిలో అగ్రికల్చర్ ప్రాెననింగ్ కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖలను ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్రంలో ఫుడ్ప్రాెననింగ్ రంగం గురించి బేగంపేటలోని సామాజిక ఆర్థిక అధ్యయనసంస్థ అసోనియేట్ ప్రొఫెసర్ డా. ఎన్. చంద్రశేఖర్‌రావు విశేషంగా అధ్యయనం చేశారు. ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపూర్, చిత్తూరు జిల్లాలన్నిటిని కలిపి ఫుడ్ప్రాెననింగ్ జోన్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో డా. ఎన్. చంద్రశేఖర్‌రావు అధ్యయన వివరాలను పాఠకులకు అందిస్తున్నాం. ప్రస్తుతం డా. ఎన్. చంద్రశేఖరరావు ఢిల్లీలోని ఇన్‌న్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్(ఐఇజి)లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
1947 సమయంలో ఆహార ఉత్పత్తులు అధికం చేేనందుకు దృష్టి కేంద్రీకరించాం. అన్ని ప్రభుత్వ పథకాలు, హరితవిప్లవం ఆ రోజుల్లో ఆహారాన్ని ఎక్కువ ఉత్పత్తి చేయటమే మన ప్రధాన కార్యక్రమంగా వుండేది. 1980 నాటికి పరిన్థితి మారింది. మధ్యతరగతి వర్గాలనేవి విస్తరించాయి. పరిశ్రమల్లో ఆహార పరిశ్రమల అవసరాన్ని ప్రభుత్వం గుర్తించి ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖను 1988లో ఏర్పాటు చేశారు.
దేశం మొత్తంమీద మూడు లక్షల యాభైవేల కోట్ల రూపాయలు విలువ చేేన ఫుడ్ప్రాెననింగ్ రంగం. యేటా 9 నుంచి 10 శాతం ఒడిదుడుకులకు లోనవుతోంది. మహారాష్ట్ర మొదటిస్థానం, ఉత్తరప్రదేశ్ రెండవస్థానం, మనరాష్ట్రం మూడవస్థానంలో వుంది. దక్షిణ భారత ఆహార పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ ప్రముఖ స్థానం పొందింది. మనరాష్ట్రంలోని తయారీ రంగంలో కూడా 20 శాతం వాటా ఈ రంగానిది. ముఖ్యంగా ఆకలి నిర్మూలనకు వ్యవసాయం కొనసాగింది. ఆ దిశగానే రైతులు తిండిగింజలు ఉత్పత్తిలో నిమగ్నమయ్యారు.
గతంలో తలసరి ఆదాయం పెరుగుదల 1957-1980 వరకు 1.6 శాతం మాత్రమే. 1980-2005 వరకు తలసరి ఆదాయం 3.5 శాతం పెరిగింది. గత నాలుగు సంవత్సరాల్లో తలసరి ఆదాయం 6 శాతం కంటే ఎక్కువగా వేగంగా పెరిగింది. అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో తీసుకునే ఆహారంలో ప్రాెనన్డ ఉత్పత్తులు చాలా ఎక్కువగా వుంటాయి. మధ్యతరగతి వర్గాలు ఆహారంలో పాలు, పండ్లు, కూరగాయలు, మాంసం ఈ ఉత్పత్తులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. మహిళలు ఎప్పుడైతే ఉద్యోగాలకు వెళ్తున్నారో తప్పనిసరిగా వాళ్ళు చేేన పనులు ఎవరో ఒకరు చేని మార్కెట్లో అందిస్తుంటారు. నగరీకరణ ప్రభావం వల్ల పిల్లలు ప్రాెనన్డ ఫుడ్ తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మన రాష్ట్రంలో 5 లక్షల హెక్టార్లు ఉన్నటువంటి పండ్లు, కూరగాయల పెంపకం ఈ రోజు 10 లక్షల హెక్టార్లయింది. 17.8 లక్షల హెక్టార్లలో పండ్లు, కూరగాయలు, సుగంధద్రవ్యాలు, ప్లాంటేషన్ క్రాప్స్ పండిస్తున్నారు. దానికి తగిన విధంగా ప్రాెననింగ్ జరగకపోతే రైతు నష్టపోయే అవకాశం ఉంది.
ప్రాెనన్ ఉత్పత్తులు ధనికులకు ఉపయోగపడతాయి అనే అవగాహనతో మొత్తం ప్రభుత్వ విధానమంతా రూపొందించబడింది. ఒక ప్రాెనన్డ ఉత్పత్తి మీద ెనంట్రల్ టాక్స్ వుంటుంది, రాష్ట్ర ప్రభుత్వ పన్నులు, మండీటాక్స్ వుంటుంది ప్రాెనన్డ ఉత్పత్తి ధరలో 25 శాతం ఈ పన్నులకే సరిపోతుంది. దీని అభివృద్ధికోసం రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు గుర్తింపు ఇచ్చి పన్నులను తగ్గించాయి. పన్నుల సరళీకరణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రాధాన్యతను గుర్తించి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేనింది. ప్రధానంగా ఏ దేశంలోనైనా తాజాగా కొనే కూరగాయలు, పండ్లు, ఏ ఆహార ఉత్పత్తులయినా ధర ఎక్కువగా వుంటుంది. అదే ప్రాెనన్డ వస్తువులన్నీ చౌకగా లభిస్తాయి. మన దేశంలో దీనికి వ్యతిరేక ధోరణి వుంది. 11వ పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వం లక్షకోట్ల రూపాయల పెట్టుబడి ఈ రంగంలో పెట్టాలని నిర్ణయించింది. ఫుడ్ప్రాెననింగ్ పరిశ్రమను ఫుడ్ ేనఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006 చట్టం క్రిందకు వచ్చింది. దీనితో పరిశ్రమను స్థాపించదలచినవారు అనేక ప్రభుత్వ విభాగాలచుట్టూ తిరిగే శ్రమ తప్పుతుంది. మానవ వనరుల కోసం తంజావూరులో వున్నటువంటి ఇండియన్ రైన్ రీెనర్చ్ ప్రాెననింగ్ ెనంటర్ని ఫుడ్ ప్రాెననింగ్ ెనంటర్గా మార్చటం జరిగింది. నేషనల్ ఇన్‌న్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి మేనేజ్మెంట్ నెలకొల్పడం జరిగింది.
మన రాష్ట్రంలో అనేక రకాల పండ్లు కూరగాయల్ని పండించగలం. వరిలో 120 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం. ఇందులో 20 లక్షల టన్నులు ప్రాెననింగ్ చేేన అవకాశం వుంది. గోధుమ లాగా వరిలో కూడా కొన్ని ఉత్పత్తుల్ని తయారు చేయగలగాలి. గోధుమలో రకరకాల ఉత్పత్తుల్ని చేయడానికి ఆస్కారముంది. వరిలో కూడా రైన్ బ్రాన్ ఆయిల్‌ను ఈ మధ్యే గుర్తించడం జరిగింది. మన రాష్ట్రంలో లక్ష టన్నుల రైన్బ్రాన్ ఆయిల్‌ను తయారు చేయవచ్చని అంచనా. వ్యవసాయ ఉత్పత్తుల్లో అదనపు విలువలు జోడించి ఉత్పత్తులు తీసుకురాగలిగితే ఈ రంగంలో మన రాష్ట్రంలో ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం వుంది.
రాష్ట్ర, దేశస్థాయిలో తయారీ రంగ ఉపాధికల్పనలో వపరిశ్రమ తరువాత స్థానం ఆహారపరిశ్రమది. ఆహార పరిశ్రమ దేశంలో 82 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా అంతే మందికి ఉపాధి కల్పిస్తోంది. గ్రామాల్లో వ్యవసాయం కాకుండా వ్యవసాయేతర గ్రామీణ ఉపాధి అవకాశం కావాలి. మొత్తంగా 15 శాతం అవకాశాలను కల్పిస్తుంది.
9 శాతం వాటా మన రాష్ట్రానికి వుంది. మూడు లక్షల 50 వేల కోట్ల రూపాయలు విలువ చేేన ఈ పరిశ్రమ మన రాష్ట్రంలో 11 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. వేరే రంగాల్లో 100 రూపాయల్తో ఉద్యోగం కల్పించే అవకాశం వుంటే ప్రాెననింగ్ రంగంలో 70 రూపాయల్తోనే ఉద్యోగం కల్పించవచ్చు. 72 శాతం అసంఘటిత రంగం 84 శాతం ఉద్యోగాల్ని కల్పిస్తుంది.
నాణ్యమైన ఆహారోత్పత్తులను తయారు చేయగలిగిన టెక్నాలజిని అభివృద్ధి చేయాలి. టెక్నాలజీని పెంచి ఉత్పాదకతను పెంచినప్పుడే ఫుడ్ప్రాెననింగ్ పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. మొత్తం పరిశ్రమకు ఇచ్చేటటువంటి బ్యాంకు రుణాల్లో ఆహార తయారీ పరిశ్రమకు ఇస్తున్న రుణం 3 శాతం మాత్రమే. ఇవన్నీ చిన్న పరిశ్రమలు కావటం, బేరమాడే శక్తి లేకపోవటం, లాబీ చేేన అవకాశం లేకపోవటం వంటి కారణాలతో బ్యాంకు రుణాలు కావలనినంతగా పొందలేక పోతున్నాం. జీడి పిక్కల పరిశ్రమలో ఎగుమతికి మౌలిక సదుపాయాలు కల్పించాలి. నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో వుండాలి. జీడి తోటల్ని అభివృద్ధి చెయ్యాలి. రొయ్యల పెంపకంలో కార్మికులకు శిక్షణ ఇవ్వాలి. కొత్తరకాల చేపల్ని పెంచడానికి అవకాశం ప్రభుత్వం కల్పించాలి. విత్తన సమస్యలు, దాణా సమస్యలు పరిష్కరించినప్పుడు పరిశ్రమ పెరుగుతుంది. కార్మికులు, ఉత్పత్తిదారులు అందరు లాభం పొందుతారు. పచ్చళ్ళ వంటి వాటిపై పన్నులను తగ్గించాలి. అసంఘటిత రంగంలో వున్న ఉత్పత్తిదారులు దాని బ్రాండ్ చేని అమ్ముకోగలుగుతారు. మామిడి తాండ్ర ఉత్పత్తిదారులకు శీతల గిడ్డంగులు అందుబాటులో లేవు. 82 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిేన్త రాష్ట్ర, రైతుల, కార్మిక, వ్యవసాయ రంగాల అభివృద్ధి జరుగుతుంది.
అన్ని రంగాల్లో భవిష్యత్ ఆశావహంగా వుంది. ఆహార పరిశ్రమ నుంచి వెళ్ళే ఉత్పత్తులు చాలా తక్కువ ధరకు వెళ్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ పరిన్థితి నుంచి బయటపడి నాణ్యమైన ఉత్పత్తులు అధికంగా సాధించడం జరుగుతుందని అందరూ భావించడం జరుగుతోంది. పలు పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చారు. ఆహార పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ అను కున్నటువంటి అవకాశాలను తప్పనిసరిగా అందుకుంటుందని మాత్రం చెప్పవచ్చు.

- ప్రొఫెసర్. యన్. చంద్రశేఖరరావు, వ్యవసాయార్థిక శావేత్త, ఇన్‌న్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ గ్రోత్, ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపన్, ఢిల్లీ. ెనల్ : 09818678975

Rythunestham

Editor :Venkateswara Rao
Ritunestham - Agricultural Monthly Magazine

No comments:

Post a Comment