ప్రసార మాధ్యమాలు రైతునేస్తాలు కావాలి

ఇది సమాచార విప్లవాల యుగం. వీటిని సకాలంలో సద్వినియోగం చేసుకోగల్గిన వారిదే విజయం. విశ్వం మొత్తాన్ని అరచేతిలో క్షణం క్షణం వీక్షిస్తున్న కాలమిది. కాలానికి దీటుగా ముందుకు సాగాల్సిన అవసరం అత్యవసరం కూడా.
సమాచార విప్లవంలో రైతులను భాగస్వాములను చేయాలి. అప్పుడే వ్యవసాయరంగం లాభసాటి వ్యాపకమవుతుంది. ఇంతవరకు సమాచార విప్లవాలన్నీ రైతులకంటే వ్యవసాయ వాణిజ్య వర్గాలు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాయి. రైతులు ఎప్పటిలాగే కష్టాలను భరిస్తూ నాగలి నడిపిస్తున్నారు. వీరి ఉత్పత్తుల మీద ఆధారపడిన వర్గాలు మాత్రం నిత్యం లాభాలతో సాగుతున్నారు. ఇది సమని పోవాలంటే రైతులకూ ఆధునిక సమాచార విప్లవ ఫలాలు అందాలి. అందించాల్సిన బాధ్యత తప్పనిసరిగా ప్రసార మాధ్యమాల మీద ఉంది. పాత్రికేయులు ఆ దిశగా వారి కలాలతో అక్షరయజ్ఞం చేయాలి.
ఒకనాడు ఆకాశవాణి, దూరదర్శన్లు మాత్రమే సంక్షేమంలో భాగంగా వ్యవసాయ ప్రసారాలను ప్రసారం చేేనవి. ప్రస్తుతం దాదాపు అన్ని ప్రైవేట్ ఛానల్స్ ప్రధానంగా తెలుగు ఛానల్స్ వ్యవసాయ కార్యక్రమాలు అందిస్తున్నాయి. ఇక ప్రింట్ మీడియా విషయానికొేన్త దాదాపుగా అన్ని దినపత్రికలు వ్యవసాయ సమాచారం ప్రాంతాలకు అనువుగా అందించే క్రమంలో పోటీపడుతుండడం విశేషం. ఇక వ్యవసాయ మాస పత్రికలు కూడా పెరిగాయి. ఇది మంచి పరిణామం. అయితే రాశి పెరుగుతున్నా వాని అంతగా ఉండటం లేదన్న విమర్శ వుంది. పోటీ ప్రపంచంలో తప్పనిసరిగా వాని కూడా పెరుగుతుందనే నమ్మకం రైతునేస్తానికుంది. ప్రతివారు విధిగా రైతునేస్తాలుగా మారుతారనే ప్రగాఢ విశ్వాసముంది.
వ్యవసాయ వాణిజ్య సమాచారం వస్తున్నంత విపులంగా ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానం ప్రసార మాధ్యమాలలో కన్పించడం లేదు. సమస్యలమీద దృష్టి కేంద్రీకరిస్తూ, ఆ సమస్యల పరిష్కారంలో మీడియా తీసుకుంటున్న చొరవ రైతులకు కావల్సిన సమాచారం గురించి అంత నిర్దిష్టంగా పట్టించుకోవటంలేదు. ఆ దిశగా మీడియా ప్రయాణిేన్త రైతులకు మరింత మేలు జరుగుతుందని రైతునేస్తం భావన.
ఈ ప్రయాణంలో తనదైన శైలిలో, తనకున్న పరిధిలో రైతునేస్తం శాయశక్తులా కృషి చేస్తూ వుంది. మా తొమ్మిదేళ్ళ పయనం కాలచక్రంలో అత్యల్పమైనా, మా లక్ష్యాలు, ఆశయాలు సాధనలో కొంతమేర సఫలీకృతమయ్యామనుకుంటున్నాం. మా పత్రికతోపాటు మేము నిర్వహిస్తున్న కార్యక్రమాల వల్ల రైతులకు పరోక్షంగా కొంత మేలు జరిగిందని భావిస్తున్నాం. ఇక ముందు కూడా మా ప్రయాణం లక్ష్యసాధన దిశగా సాగుతుంది. దాని గురించి ఎటువంటి సందేహం లేదు. ఈ క్రమంలో మీడియా తన దృష్టంతా రైతుమీద కేంద్రీకరించే రోజులు రావాలని కోరుకుంటున్నాం. అప్పుడే అసలు నిసలైన అభివృద్ధి సాధించగలమనే విశ్వాసం రైతునేస్తంకుంది.
ఈ రోజు పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం,
ేనంద్రియ వ్యవసాయం,
సున్థిర వ్యవసాయం,
పర్మాకల్చర్.... ఇలా అనేక పద్ధతులు గురించి చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి. పలు స్వచ్ఛంద సంస్థలు సున్థిర వ్యవసాయ భారతమంటూ పలు ప్రాంతాలలో ఈ విధానాలు రైతులలో ఆచరింపచేస్తూ వీటిని విశ్వవ్యాప్తం చేయాలంటున్నారు. పెరుగుతున్న జనాభాతో వచ్చే సమస్యలకు ఆధునిక వ్యవసాయమే పరిష్కారమని పరిశోధకుల భావన. పాత, కొత్తల కలయిక ప్రస్తుతం అవసరమని కొందరి వాదన. ఇలా ఎన్ని వాదనలున్నా ‘‘రైతును రాజు’’ చేయటమే లక్ష్యంగా, వ్యవసాయ సమాజానికి సమాజంలో అత్యున్నత గౌరవం దక్కేలా చేయటం కోసం సాగుతున్న మహత్తర యజ్ఞంలో ‘‘రైతునేస్తం’’ తన వంతు కర్తవ్యం నిర్వహిస్తుందని, ఆ దిశగా పాత్రికేయలోకం కూడా రైతుహితం కోసం అడుగులో అడుగేయాలని మనసారా కోరుకుంటున్నాం.

            - సంపాదకులు

Rythunestham

Editor :Venkateswara Rao
Ritunestham - Agricultural Monthly Magazine

No comments:

Post a Comment