రూపాయి మారకం విలువ వ్యవసాయరంగంపై ప్రభావం

గత రెండు మాసాలుగా రూపాయి డాలరు మారకం విలువ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతోంది. డాలరుకి 53 రూపాయల నుండి 68 రూపాయల వరకు ఎగబ్రాకి మళ్ళీ 62 రూపాయలకు తగ్గింది. డాలరు విలువ పెరగటం వల్ల దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. బంగారం ధర పెరిగింది. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఎరువుల ధరలు పెరిగే ప్రమాదముంది. మనం దిగుమతి చేసుకునే వంటనూనెలు, పండ్లు, ఓట్స్ వంటి వినిమయ వస్తువుల ధరలు పెరిగాయి. విదేశీ పెట్టుబడులు వెనక్కు మళ్ళాయి. స్టాక్ మార్కెట్లు పడి లేచాయి. విధానాల విషయంలో ప్రభుత్వ ఆర్థిక శాఖకు రిజర్వుబ్యాంక్‌ల మధ్య బేధాభిప్రాయాలు బయటపడ్డాయి.
మారకం విలువ నిర్ణయం
        మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు డాలరుకి రూ. 2.75 మారకం విలువగా ఉండేది. అది ఇటీవల రూ. 68ని అధిగమించింది. ఇలా డాలరు మారకం విలువ రూపాయల్లో పెరగటాన్ని దేశ ఆర్థిక విధానాల వైఫల్యంగా చాలామంది పరిగణిస్తున్నారు. దేశపు పరువు కూడా పోతోందని చాలా మంది బాధపడుతున్నారు.
        మారకపు విలువను ప్రధానంగా ఎగుమతులు, దిగుమతులు ప్రభావితం చేస్తాయి. దిగుమతుల విలువ కన్నా ఎగుమతులు విలువ ఎక్కువగా ఉంటే అంతర్జాతీయ వ్యాపారంలో ‘మిగులు’ని సాధించగలుగుతాము. ఎగుమతుల విలువ కన్నా దిగుమతుల విలువ ఎక్కువగా ఉంటే ‘వ్యాపారలోటు’ ఏర్పడుతుంది. వ్యాపార లోటు ఏర్పడకూడదనుకుంటే మన ఎగుమతుల్ని పెంచాలి. లేదా దిగుమతుల్ని నియంత్రించాలి. ఎగుమతులు పెరగాలంటే ఎగుమతి చేేన వస్తువుల ధరలు అంతర్జాతీయ కరెన్సీల్లో తక్కువగా ఉండాలి. అలా జరగాలంటే మన దేశంలో వస్తువుల ఉత్పత్తి వ్యయాన్ని అదుపులో ఉంచాలి. అంటే ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉండాలి. ముడి సరుకుల ధరలు, శ్రామికుల వేతనాలు తక్కువగా ఉంటేనే అది సాధ్యపడుతుంది. ప్రజల అవసరాలతో పోలిేన్త వస్తువుల ఉత్పత్తి ఇబ్బడిముబ్బడిగా ఉండాలి. అప్పుడే ఎగుమతి చేయడానికి మిగులు ఏర్పడుతుంది. జాతీయ మార్కెట్లో ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరల కన్నా తక్కువగా ఉన్నప్పుడే ఎగుమతుల్ని పెంచటం సాధ్యపడుతుంది.
        కాని మనదేశంలో ముడి సరుకుల ధరలు, వేతనాలు పెరుగుతూనే ఉన్నాయి. పెట్టుబడి రుణాలపై వడ్డీ రేట్లు కూడా ఎక్కువే. ఫలితంగా ఉత్పత్తి వ్యయం పెరుగుతూనే ఉన్నది. రూపాయల్లో ధరలు పెరుగుతుంటే వాటిని డాలర్లలో తక్కువగా ఉంచాలంటే డాలరుతో రూపాయి మారకం విలువ తగ్గాల్సి ఉంటుంది. ఇలాంటి పరిన్థితుల వల్లనే డాలరుకి రూపాయలు 2.75 నుండి 68 వరకు పెరిగాయి.
        1947 నుండి 1991 వరకు మన ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థను నియంత్రించే ప్రయత్నాలు చేశాయి. దిగుమతుల్ని అదుపు చేయటం ద్వారా వ్యాపారలోటు ఏర్పడకుండా చూడాలని ప్రయత్నించాయి. ఎగుమతులను ప్రోత్సహించటంపై పరిమితమైన ఆసక్తినే చూపాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరల్ని అభివృద్ధి చెందిన దేశాలు నియంత్రిస్తున్నాయి కాబట్టి ఎగుమతుల్ని పెంచాలనే లక్ష్యం పెద్దగా ఉపయోగముండదని భావించాయి.
విదేశీమారకద్రవ్యంపై ఆంక్షలు
        ఆ కాలంలో ఒకటి రెండు రకాల కార్లు, రెండు మూడు రకాల స్కూటర్లు, మోటారు ెనైకిళ్ళు మాత్రం దేశంలో లభించాయి. అలాగే ఏ వస్తువు విషయంలోనూ పెద్దగా వైవిధ్యం ఉండేది కాదు. ప్రభుత్వం విదేశీ మారకపు రేటుని నిర్ణయించేది. అప్పుడప్పుడూ ఆ రేట్లను మార్పు చేనినా నాలుగైదేళ్ళ పాటైనా ఒక రేటు న్థిరంగా ఉండేది. విదేశీ మారక ద్రవ్యం పరిమితంగా ఉండేది. దిగుమతిదారులకు వాటిని ప్రభుత్వమే కేటాయించేది. విదేశాల్లో చదువుకోవాలన్నా, వైద్యం చేయించు కోవాలన్నా చాలా పరిమితంగా డాలర్లనో, పౌండ్లనో కేటాయించేవారు. అంతకుమించి విదేశీమారక ద్రవ్యం కావాలంటే బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాల్సి వచ్చేది. అధికారమార్పిడి రేటు కన్నా మూడు నాలుగు రూపాయలు ఎక్కువిేన్తగాని ఒక డాలరు లభించేదికాదు. ఎగుమతిదారులు తాము ఆర్జించిన విదేశీమారక ద్రవ్యాన్ని అధికారమార్పిడి రేటుకే బ్యాంకుల కివ్వాల్సి వచ్చేది. ఎగుమతిదారులకిది కంటగింపుగా ఉండేది. దిగుమతిదారులు విదేశీమారక ద్రవ్యాన్ని పొందటానికి అధికార్లు, రాజకీయ నాయకులకు లంచాలివ్వాల్సి వచ్చేది. బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్లు దిగుమతి చేసుకోవాలంటే భారీగా దిగుమతి సుంకాల్ని చెల్లించాల్సి వచ్చింది. 1980 తర్వాత ఈ విధానాలను కొంతవరకు సవరించినా విదేశీ మారక ద్రవ్య నిల్వలు తరిగిపోయాయి. ఆర్థికాభివృద్ధి రేటు 3 నుండి 5 శాతంగా మాత్రమే ఉండేది.
        1991 నాటికి విదేశీమారక ద్రవ్యనిల్వలను హరించేశాయి. మన బంగారపు నిల్వల్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కి తరలించి అత్యవసరమైన దిగుమతుల్ని అనుమతించటానికి విదేశీమారక ద్రవ్యాన్ని అప్పుగా పొందాల్సి వచ్చింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుండి భారీ రుణాల్ని తీసుకోవాల్సిన పరిన్థితి వచ్చింది. డాలరుతో రూపాయి మారకపు విలువను భారీగా తగ్గించవలని వచ్చింది.
మార్కెట్ నిర్ణయించే మారకపు ధర
        1991లో ఆర్థిక సంస్కరణల్ని ప్రారంభించిన తర్వాత కొన్ని సంవత్సరాలకు ‘న్థిరమైన మారకపు విలువ’ నుండి ‘మార్కెట్ ఆధారిత మారకపు విలువను ప్రవేశపెట్టారు. ఎగుమతుల్ని ప్రోత్సహించడం, దిగుమతుల్ని అనుమతించడం, విదేశీ పెట్టుబడుల్ని అనుమతించడం ఒకదాని వెంట మరొకటి వేగంగా జరిగాయి. మనదేశ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ సంస్థాగత మదుపుదారులు ప్రవేశించి దాదాపు ఐదవవంతు వాటాలను కొనుగోలు చేశారు. మనదేశం ఆశించినట్లుగా ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కువగా దేశంలోకి రాలేదు. చైనా కమ్యూనిస్టు దేశమైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని బాగా ఆకర్షించింది. శ్రామికులకు తక్కువ వేతనాలిచ్చినా కిమ్మనలేదు. అవసరమైనప్పుడు శ్రామికుల్ని నియమించి, అవసరం లేనప్పుడు తీేననినా ఊరుకుంది. వారి శ్రామికుల్లో కష్టించే తత్వం, క్రమశిక్షణ మెండుగా ఉండటం వల్ల ప్రపంచంలోని బహుళజాతి కంపెనీలన్నీ అక్కడే ఉత్పత్తిని ప్రారంభించాయి. అచిరకాలంలోనే ప్రపంచానికే ఉత్పత్తి కేంద్రంగా మారింది. చైనాలో తయారైన వస్తువులు ప్రపంచ మార్కెట్లను వశం చేసుకున్నాయి. కాని సోషలిస్టు ముసుగులో ఉన్న పెట్టుబడిదారీ దేశమైన భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాలేదు. కేవలం ఇంగ్లీష విజ్ఞానం ఉన్నందువల్ల కొన్ని ేనవా సంస్థలు మాత్రం దేశంలో ప్రవేశించాయి. అయినా దేశంలో ద్రవ్యోల్బణం ఎక్కువగానే ఉంది. రూపాయి మారక విలువ పడిపోకుండా విదేశీ సంస్థాగత పెట్టుబడులు కొన్నాళ్ళపాటు ఆదుకున్నాయి. ‘అభివృద్ధి బుడగ’ కొన్నాళ్ళపాటు ఊరించింది. దేశంలో వస్తువైవిధ్యం పెరిగింది. వినిమయ సంస్కృతి బాగా పెరిగింది. విలాస వస్తువులకు మార్కెట్లు విస్తరించాయి. కాని ‘అరువు తెచ్చుకున్న అభివృద్ధి’ ఎంతో కాలం నిలవలేదు. భారత్ స్టాక్ మార్కెట్లలో లాభాలు రావనే అంచనాలతో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల్ని ఉపసంహరించడం ప్రారంభించగానే రూపాయి మారకం విలువ భారీగా తగ్గింది.
ద్రవ్యోల్బణాల్లో వ్యత్యాసం
        ఒక డాలరుకి చెల్లించాల్సిన రూపాయలు పెరుగుతున్నాయంటే అందుకు మౌలిక కారణాలను అర్థం చేసుకోవాలి. అమెరికాలో ద్రవ్యోల్బణం రెండు నుండి నాలుగు శాతం మధ్య ఉంటుంది. గత అరవై ఐదేళ్ళలో అది సగటున మూడు శాతంగా ఉంది. మనదేశంలో కొన్ని సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం పది నుండి పదిహేను శాతం మధ్య ఉంది. కొన్ని సంవత్సరాల్లో ఐదారు శాతంగా మాత్రమే ఉంది. సగటున ఎనిమిది శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. అంటే అమెరికా, భారత్ దేశాల్లో ద్రవ్యోల్బణాల్లో తేడా సగటున సాలీనా ఐదు శాతంగా ఉంది. అలా ఉన్నప్పుడు ఆర్థిక సూత్రాల ప్రకారం ప్రతి పధ్నాలుగు సంవత్సరాలకు డాలరుకి చెల్లించాల్సిన రూపాయలు రెట్టింపు కావాలి. అంటే 1947లో డాలరుకి రూ. 2.75 పైసలు మారకం రేటుగా ఉంటే 1961 నాటికి రూ. 5.50 పైసలుకి, 1975 నాటికి రూ.11 లగానూ, 1989 నాటికి రూ. 22గానూ, 2002 నాటికి రూ. 44 గానూ, 2016 నాటికి రూ. 88గానూ ఉండాలి. అలాంటి పరిన్థితుల్లో 2013లో డాలరుకి రూ. 68కి మారకం రేటు చేరుకోవటంలో ఆశ్చర్య పడాల్సినదేమీ లేదు.
        జపాన్‌లో 1945 నాటికి ఒక డాలరుకి 365 ెున్‌లు మారకం రేటుగా ఉండేది. కాని ఆ తర్వాత వారు సాంకేతిక ప్రగతిని ఉపయోగించుకొని, క్రమశిక్షణతో కష్టపడి ద్రవ్యోల్బణాన్ని ఒకటి, ఒకటిన్నర శాతానికే పరిమితం చేసుకోగలిగారు. అందుకే ెున్ మారకపు విలువ డాలరుకి 70 ెున్‌ల వరకు చేరుకొని, మళ్ళీ వంద ెున్‌ల స్థాయికి వెనక్కి జారింది. చైనా, దక్షిణ కొరియాలు తమ కరెన్సీల విదేశీ మారక విలువను కావాలని తగ్గించి ఉంచి, ఎగుమతుల్లో వృద్ధి సాధించి, వ్యాపార మిగులును కలిగి ఉన్నాయి. అమెరికా ఆదేశాలను విదేశీ మారకపు విలువను పెంచుకొని తమ దేశాన్ని వ్యాపార లోటు నుండి రక్షించమని కోరుతోంది. మరోవైపు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుకోలేని దేశాలు తమ కరెన్సీ విలువను శరవేగంతో కోల్పోతున్నాయి. లాటిన్ అమెరికా, ఆఫ్రికా పలుదేశాల్లో ద్రవ్యోల్బణం స్వారీ చేయటం వల్ల, వాటి కరెన్సీల విలువ అడుగంటి పోయింది.
అడ్డదార్లు లేవు
        భారతదేశానికి కరెన్సీ విలువను కాపాడటానికి తొక్కదగిన అడ్డదార్లేమీ లేదు. బంగారం దిగుమతుల్ని నియంత్రించడం ద్వారా తాత్కాలికంగా వ్యాపారలోటుని తగ్గించుకోవచ్చు. కాని ఎంతోకొంత బంగారం కొనకుండా ఏ కుటుంబమూ ఉండలేదు. అలాగే దిగుమతి సుంకాల్ని పెంచినంత మాత్రాన సంపన్నులు విలాసవంతమైన దిగుమతుల్ని మానుకోరు. అలాగే మన ఎగుమతుల్లో వృద్ధి సాధించాలంటే వస్తువుల ఉత్పత్తిలో మిగుల్ని సాధించాలి. ద్రవ్యోల్బణం అదుపులో ఉంటేగాని వడ్డీ రేట్లను తగ్గించే వీలుండదు. కాని జనాకర్షణ పథకాల బాటలో వెళ్ళి ద్రవ్యోల్బణం పెరిగితే రూపాయి విలువ తగ్గుతుంది. అది తగ్గే కొద్దీ విదేశీ పెట్టుబడులు మరలిపోతాయి. వ్యాపార లోటుతోపాటు మూలధన పలాయనమయితే రూపాయి విలువలో భారీ పతనం తప్పదు.
        రూపాయి మారకం విలువ తగ్గటం వల్ల వ్యవసాయ ఉపకరణాల ధరలు పెరుగుతాయి. డీజిల్, ఎరువులు, పురుగుమందులు వంటి దిగుమతి సరుకుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం హెచ్చే కొద్దీ కూలి రేట్లు పెరుగుతాయి. వ్యవసాయంలో ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. అయితే ‘గుడ్డిలోమెల్ల’గా ఎగుమతి చేేన వ్యవసాయ ఉత్పత్తులకు ఎక్కువ రూపాయలు లభిస్తాయి. రొయ్యల ఉత్పత్తిదార్లకు మంచి ధర లభిస్తున్నది. గత నెలలో కూరగాయల ధరలు 65 శాతం పెరిగినట్లు ద్రవ్యోల్బణ గణాంకాలు తెలుపుతున్నాయి. ఉల్లి ఉత్పత్తిదారులకు పరిన్థితి లాభదాయకంగా ఉంది. కాఫీ, టీ, జీడిపప్పు, పత్తి, పండ్లు, పండ్ల రసాలు, బాస్మతి బియ్యం వంటి ఎగుమతులకు ఎక్కువ రూపాయలు లభిస్తున్నాయి. అందులో సగం రైతులకు లభించినా అది అభిలషణీయమే. ఇప్పటికీ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు దిగుమతులకన్నా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి వ్యవసాయరంగానికి కొంత మేలు జరుగుతుంది. అయితే ఈ ప్రయోజనాలు తాత్కాలికమే. ద్రవ్యోల్బణం పెరిగేకొద్దీ వినిమయ వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఉత్పాదకశక్తి, ఎగుమతి శక్తీ క్షీణిస్తాయి. ద్రవ్యోల్బణాన్ని ఐదు శాతాని కన్నా పరిమితం చేయగలిగితేనే వ్యవసాయరంగానికైనా మేలు జరుగుతుంది. అప్పుడు రూపాయి మారకం విలువ వేగంగా కాకుండా మెల్లగా తగ్గుతుంది. వ్యవసాయదారుల ప్రయోజనాలు దేశ ఆర్థిక ప్రయోజనాలతో కలిేన ఉంటాయిగాని వేరుగా ఉండవు.
  డా. కిలారు పూర్ణచంద్రరావు
ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త,
(రిటైర్డ్ అండ్ కన్సల్టెంట్ ఇక్రిసాట్)


Rythunestham

Editor :Venkateswara Rao
Ritunestham - Agricultural Monthly Magazine

No comments:

Post a Comment